ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం సమీపంలోని శిఖరం చెక్ పోస్ట్ దగ్గర అటవీశాఖ ఉద్యోగి కరిముల్లా పై దాడి ఘటనలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పై శ్రీశైలం పోలీసులు అర్థరాత్రి దాటిన తరువాత కేసు నమోదు చేసారు. ఎమ్మెల్యే ను ఏ2గా చేర్చారు. వాహనంలో దాడి చేసిన తరువాత అటవీశాఖ ఉద్యోగులను శ్రీశైలంలోని గొట్టిపాటి నిలయం అతిథి గృహంలో బంధించారు. ఈ అతిథి గృహాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిర్మించి ఆలయానికి బహూకరించారు.
అయితే దాని నిర్వహణలో మంత్రి కి మాత్రం ఎలాంటి లేదు. కొందరూ ప్రముఖులు వచ్చినప్పుడు ఆ అతిథి గృహాన్ని కేటాయించాలని అడుగుతుంటారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఆ అతిథి గృహాన్ని కేటాయించాలని శ్రీశైలం ఎమ్మెల్యే కోరడంతో ఆయనకు కేటాయించారు. అదే గృహంలో తమను బంధించి దాడి చేశారని అటవీశాఖ ఉద్యోగులు పోలీసులకు వివరించారు. అటవీశాఖ ఉద్యోగులపై దాడి కేసులో శ్రీశైలం నియోజకవర్గ జనసేన ఇన్ చార్జీ రౌతు అశోక్ ప్రధాన నిందితుడు అని తేల్చారు.