ఈరోజు ఈ రాశుల వారికి ఉద్యోగ అవకాశాలు..

-

జూన్ 7 మంగళవారం ఏ రాశి వారికి మంచి ఫలితాలు, ధన, వస్తు లాభాలు ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..

మేషం..వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృషభం ..పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు..ఆర్థిక సమస్యలు పనులు మందకోడిగా సాగుతాయి..

మిథునం …పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం..అధికారుల ప్రశంసలు. మంచి గౌరవం దక్కుతుంది..

కర్కాటకం …సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ దర్శనాలు..దూర ప్రయాణాలు అధికం.

సింహం .. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలలో మీ మాటే నెగ్గుతుంది.

కన్య …వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు..కొత్తగా పనులు మొదలు పెట్టక పోవడం మంచిది.

తుల….కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి..ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం..ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు ….మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో ఒత్తిడి..వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు..విభెదాలు వచ్చే అవకాసం ఉంది.

మకరం.. కొత్త రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు , ఉద్యోగాలలో కొత్త వివాదాలు..ఈరోజు పనికి తగిన ఫలితం ఉండదు.. జాగ్రత్తగా ఉండాలి..

కుంభం ….కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో విజయం. వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది..కొత్త పదవులు వచ్చే అవకాశం ఉంది. దైవదర్శనాలు చేస్తారు.

మీనం..ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం..ఈరోజు అనుకున్న పనులు నేర వెరుతాయి..మంచి రోజు..

Read more RELATED
Recommended to you

Latest news