ఏం… చంద్రబాబును ఎందుకు శిక్షించకూడదు? : విజయసాయిరెడ్డి

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో విచారణ ఎదుర్కొంటుండడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏం… చంద్రబాబును ఎందుకు శిక్షించకూడదు? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఏపీలో వ్యవస్థీకృత అవినీతి, మనీ లాండరింగ్, దోపిడీల రావణాసుర చరిత్రకు ముగింపు పలకాలి అని పిలుపునిచ్చారు విజయసాయిరెడ్డి. ఏపీ సీఆర్డీఏ స్కాం, ఏపీ ఫైబర్ నెట్ స్కాం, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, అమరావతి భూకుంభకోణం, ఈఎస్ఐ మెడికల్ కొనుగోళ్ల స్కాం, ఓటుకు నోటు కుంభకోణం (2016), కాల్ మనీ కుంభకోణం… ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాంతాడంత ఉంటుందని వివరించారు విజయసాయిరెడ్డి.

Vijayasai Reddy removed from Rajya Sabha panel of vice-chairmen, a day  after re-nomination

ఇదిలా ఉంటే.. చంద్రబాబు ఆదేశాలతోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ జరిగిందని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆరోపించారు. ఆయన చేసిన స్కాం జనసేనాని పవన్ కల్యాణ్ కు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి కనిపించలేదా? అని వేణుగోపాల కృష్ణ ప్రశ్నించారు. తన చేతికి వాచ్ కూడా లేదని చెప్పుకునే చంద్రబాబు కోట్ల రూపాయల ఫీజులు చెల్లించి లాయర్లను ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు వేణుగోపాల కృష్ణ. చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కక్ష సాధించాల్సిన అవసరం వైసీపీకి లేదని… కక్ష సాధించాలనుకుంటే ఇంత కాలం ఆగేవాళ్లం కాదని చెప్పారు. సీఐడీ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని వేణుగోపాల కృష్ణ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news