ఐపీఎల్ 2023 : రాజస్థాన్ రాయల్స్ కు ఐపీఎల్ సీనియర్ బౌలర్ !

-

ఐపీఎల్ మొదలుకాకముందే ఒక్కో ఫ్రాంచైజీకి తమ ఆటగాళ్లు షాకులు మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే గాయాల కారణంగా పలువురు కీలక ఆటగాళ్లు ఐపీఎల్ కు దూరం కావడం జరిగింది. అయితే కొద్దీ రోజుల ముందు నుండి రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ సైతం గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమయ్యాడు. అయితే ఇతని స్థానంలో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఎవరిని తీసుకుంటుందా అని ఆలోచిస్తున్న తరుణంలో… ఈ రోజు ఇచ్చిన అప్డేట్ తో అది కాస్త క్లియర్ అయిపోయింది. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ జట్టులతో ఆడిన అనుభవం ఉన్న సీనియర్ బౌలర్ సందీప్ శర్మను వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. దీనితో బేస్ ప్రైస్ 50 లక్షలకు సందీప్ శర్మను ఇతని స్థానంలో తీసుకుంది. ఇతనికి ఐపీఎల్ లో వికెట్లు తీసిన ఘనత ఉండడమే కాకుండా 10 సీజన్ లపాటు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news