ఈ వారం థియేటర్లలో చిన్న చిత్రాలు సందడి చేసేందుకు రెడీ అవ్వగా ఓటీటీలో అదిరిపోయే మాస్‌బ్లాక్ బస్టర్ చిత్రాలు వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మరి అవేంటో చూసేద్దాం
శ్రీను పెళ్లి… అయింది లొల్లి.. ఇప్పటి నుంచి నా పెళ్లి అయ్యేంత వరకూ నేనే అమ్మాయి వెంట పడను అని ఓ బాలుడు తన తల్లికి ప్రమాణం చేస్తాడు. అయితే ఇలా చేసి కూడా పెద్దయ్యాక ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు.. అయితే చివరికి ఏమవుతుంది? తన తల్లి చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా.. లేక ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా తెలియాలంటే ఆహనా పెళ్ళంట సినిమా చూడాల్సిందే.. రాజ్‌తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన వెబ్ సిరీస్ ఇది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్ రూపొందినట్టు ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
చిరంజీవి నటించిన రీసెంట్ సూపర్‌హిట్ గాడ్‌ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం దసరా కానుకగా విడుదలైన బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలో నవంబర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.. మలయాళీ సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయన తార, సత్యదేవ్ ప్రధాన పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 160 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది..
థియేటర్‌లలో మెప్పించి.. కార్తి కీలక పాత్రలో నటించిన స్పై థ్రిల్లర్ సర్దార్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాదు, రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ చిత్ర తెలుగు, తమిళ ఓటీటీ రైట్స్‌ను ఆహా దక్కించుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ 18వ తేదీ నుంచి తెలుగు, తమిళ భాషల్లో సర్దార్ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహించారు.
మరికొన్ని చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు… నెట్‌ఫ్లిక్స్‌లో రిటర్న్ టు క్రిస్మస్ క్రీక్ (హాలీవుడ్) నవంబరు 17, స్లంబర్‌ల్యాండ్( హాలీవుడ్) నవంబరు 18, ఇన్‌సైడ్ జాబ్ (సిరీస్) నవంబరు 18, రెజిన్ సుప్రీం సీజన్-1 (ఫ్రెంచ్) నవంబరు 18 స్ట్రీమింగ్ కానున్నాయి.. డిస్నీ+హాట్‌స్టార్‌లో ది సాంటా క్లాజ్ నవంబరు 16 ,ఇరవతం (తమిళ్/తెలుగు) నవంబరు 17, సీతారామం (తమిళ్) నవంబరు 18 రిలీజ్ కానున్నాయి.అమెజాన్ ప్రైమ్ వీడియోలో హాస్టల్‌డేజ్ సీజన్-3 (వెబ్‌సిరీస్-హిందీ) నవంబరు 16, ది సెక్స్‌లైవ్స్ ఆఫ్ కాలేజ్‌గర్ల్స్ (వెబ్‌సిరీస్) నవంబరు 18 అందుబాటులో ఉండనున్నాయి. సోనీ లివ్‌లో అనల్ మీలే పని తులి (తమిళ్) నవంబరు 18, వండర్ ఉమెన్ (తెలుగు) నవంబరు 18నుంచి అందుబాటులో ఉండనున్నాయి. జీ5లో కంట్రీ మాఫియా (వెబ్‌సిరీస్) నవంబరు 18నుంచి స్ట్రీమింగ్ కానుంది.