నితిన్​కు ఏమైంది గుర్తుపట్టలేనంతగా ఇలా మారిపోయారేంటి?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో తొలి చిత్రంతోనే వి’జయం’ అందుకుని ఆ తర్వాత ‘ధైర్యం’గా కెరీర్​ను కొనసాగిస్తూ.. ప్రేక్షకుల’దిల్’లో స్థానం సంపాదించుకున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. అయితే కొంతకాలంగా ఆయన ఆశించిన స్థాయిలో సినిమాలు ఆడటం లేదు. రీసెంట్​గా ఎన్నో అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్​గా నిలిచింది. నితిన్​ను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

అయితే వాస్తవానికి ప్రేక్షకులు ఎప్పుడూ నితిన్​ను ఎప్పుడు హ్యాండ్సమ్​ లుక్​లోనే చూశారు. కానీ తాజాగా ఆయన లుక్​ చూసి షాక్ అయిపోతున్నారు. ఏంటి నితిన్ ఇలా అయిపోయారు? ఇంతలా మారిపోయారు ఏంటి? అని అనుకుంటున్నారు. ఎందుకంటే తాజాగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నితిన్​ కొత్త లుక్​ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఆయన గుబురు గడ్డంతో కనిపించారు. ఇటీవలే సూపర్​ స్టార్ కృష్ణ కన్నమూసిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని సందర్శించేందుకు అభిమానులు సినీప్రముఖులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే అక్కడికి నితిన్​ కూడా వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్​మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఈ ఫొటోల్లోనే నితిన్ గుబురు గడ్డంతో కనిపించి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు.

తన కొత్త చిత్రం కోసం ఏదైనా వెరైటీ లుక్ ట్రై చేస్తున్నారా లేక సహజంగానే ఇలా గడ్డం పెంచారా అని చర్చించుకుంటున్నారు. కాగా, నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశి దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్​గా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news