గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయిన ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 (2023) స్మార్ట్‌ ఫోన్..

-

ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 (2023) స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదల అయింది. ఇది ఒక బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్.. కేవలం ఒక్క వేరియంట్‌లోనే ఫోన్‌ లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అందించారు. ఇంకా ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 (2023) ధర..
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మోడల్ ధరను 199 డాలర్లుగా (సుమారు రూ.16,500) నిర్ణయించారు.
ఆల్‌పైన్ వైట్, టస్కనీ బ్లూ, వొల్కానిక్ గ్రే రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 (2023) స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.
ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 (2023) సపోర్ట్ చేయనుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.
మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 (2023) పని చేయనుంది.
దీని బరువు 195 గ్రాములుగా ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా చార్జింగ్ పెట్టుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news