చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ప్ర‌పంచ క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు..

-

మెన్స్ క్రికెట్‌లో అంత‌ర్జాతీయ టీ20ల్లో 100 విజ‌యాలు అందుకున్న మొద‌టి ఆట‌గాడిగా హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు. మొహాలీ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచులో ఇండియా 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ పై విజ‌యం సాధించ‌డంతో రోహిత్ శర్మ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. కాగా.. t 20క్రికెట్‌లో అత్య‌ధిక విజ‌యాలు అందుకున్న కెప్టెన్సీ రికార్డు ఇప్ప‌టికే హిట్ మ్యాన్ పేరు మీదే ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇంగ్లాండ్‌తో జ‌రిగిన 2022 టీ20 వరల్డ్ క‌ప్ సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి రోహిత్ శర్మ ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు.దాదాపు 14 నెల‌ల త‌రువాత టీ20 టీం లోకి వ‌చ్చిన రోహిత్ శర్మ కేవ‌లం 149 మ్యాచుల్లో వంద విజ‌యాల‌ను అందుకోవ‌డం విశేషం. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ డ‌కౌట్ అయ్యాడు.మెన్స్ క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ 100 విజ‌యాల‌తో మొదటి స్థానంలో ఉండ‌గా.. పాకిస్తాన్ సీనియ‌ర్ ప్లేయర్ షోయ‌బ్ మాలిక్ 86 విజ‌యాల‌తో రెండో స్థానంలో, కింగ్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news