ముంబై లోకల్ ట్రైన్స్ ఎంత రద్దీగా ఉంటాయో మనకు తెలుసు. లోకల్ ట్రైన్స్ ఆడవాళ్లు కొట్టుకున్న వీడియోస్ మనం చాలానే చూసి ఉంటాం. జనరల్‌గా బస్‌లో సీట్ కాళీ లేకపోతే.. వెళ్లి డ్రైవర్ సీట్లో కూర్చో అని సరదాగా అంటుంటాం.. అలాంటిదే ఇక్కడ ఒకటి జరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లోకల్ ట్రైన్‌లో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజు లక్షలాది మంది ఈ రైళ్లలో ప్రయాణం చేస్తారు.. చాలా మంది ప్రజలు తమ రోజువారీ కార్యకలపాలకు వెళ్లడానికి లోకల్ ట్రైన్‌పైనే ఆధారపడతారు. ఈ నేపథ్యంలోనే లోకల్ రైలు ఎక్కేందుకు వచ్చిన మహిళకు ట్రైన్‌లో స్పెస్ లేకపోవడంతో ఏకంగా లోకో పైలెట్ సీట్లో కూర్చొని వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది..
ఓ మహిళలో లోకల్ ట్రైన్ ఎక్కేందుకు ముంబై స్టేషన్‌కు వెళ్లింది.. రైలు రాగానే రద్దీగా ఉన్నా ఆమె అలానే ఎక్కి డోర్ దగ్గర నిల్చుంది. మెట్టుకు సమీపంలో చోటు లేకుండా వేలాడుతూ ఉంది. దీంతో రైలు ఆటోమేటిక్ డోర్లు మూసుకోలేదు. దీంతో రైల్వే గార్డులు మహిళను కిందకు దించి మరో రైలు ఎక్కమని కోరారు. తలుపులు మూసుకోకపోవడంతో రైలు కదలలేదు. దీంతో ప్రయాణికులు కూడా మహిళతో వాగ్వాదానికి దిగారు. ఎవరు ఎన్ని చెప్పినా ఆమె మాత్రం అక్కడే నిలబడింది.. దీంతో రైల్వే గార్డు మహిళను తీసుకెళ్లి లోకో పైలెట్ సీట్లో కూర్చొబెట్టాడు. ఆమె కూడా ఏ మాత్రం ఆలోచించకుండా.. వెళ్లి డ్రైవర్ సీట్లో కూర్చొని వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోను 8 లక్షల మందిపైగా వీక్షించారు. మీరు ఓసారి చూసేయండి.. ముంబై లోకల్ ట్రైన్స్‌లో జరిగే ఇలాంటి ఇష్యూస్‌కు సంబంధించి ఇప్పటికే ఎన్నో వీడియోలు హల్‌చల్ చేశాయి. మొన్నామధ్య అయితే.. ఇద్దరు మహిళలు జుట్టుపట్టుకోని మరీ ట్రైన్‌లో కొట్టుకున్నారు.