నేటి బాలలే రేపటి పౌరులు.. మీ పిల్లల్లో లీడర్షిప్ స్కిల్స్ ని ఇలా పెంచండి..!

-

చాలామంది పిల్లలు అన్నిటికీ భయపడుతూ ఉంటారు. కానీ నిజానికి పిల్లల్లో ధైర్యాన్ని తల్లిదండ్రులే నింపాలి. అదే విధంగా పిల్లలకి లీడర్షిప్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి కూడా నాయకుడిగా ఉండే సామర్థ్యం ఉంటుంది. కొందరి పిల్లలకి పుట్టుకతో లీడర్షిప్ స్కిల్స్ వస్తూ ఉంటాయి. కానీ కొందరు వాళ్ళుఎదిగే క్రమంలో నేర్చుకుంటూ ఉంటారు మీ పిల్లల్లో కూడా మీరు లీడర్షిప్ స్కిల్స్ ని పెంపొందించొచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు. ప్రతి ఒక్కరికి కూడా లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి. అయితే లీడర్షిప్ స్కిల్స్ ని మీ పిల్లల్లో ఎలా నింపాలి…? ఏ విధంగా మీ పిల్లల్ని మంచి లీడర్ గా మార్చాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

 

పొరపాట్లను యాక్సెప్ట్ చేయడం:

ప్రతి ఒక్కరూ పొరపాట్లు చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు అయితే పొరపాటు నుండి నేర్చుకోవాలని వారికి తల్లిదండ్రులు చెప్పాలి. అంతేకానీ పొరపాటు చేస్తే వాళ్ళని శిక్షించకూడదు. మంచి నాయకుడిగా పిల్లలు మారాలంటే కచ్చితంగా పొరపాట్లని యాక్సెప్ట్ చేయమని వారికి చెప్పండి దాని నుండి నేర్చుకునేలా చేయండి.

ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించండి:

మీకు ఎదురయ్యే సందర్భాలలో వారి ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేలా మీరు మార్చాలి. బయటకు వెళ్ళినప్పుడు ఆహారాన్ని ఆర్డర్ చేయమనడం లేదంటే లిస్ట్ రాసి సామాన్లు తీసుకు రమ్మని చెప్పడం ఇటువంటివి చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి.

బాధ్యత అలవాటు చేయండి:

సెలవల సమయంలో లేదంటే అవకాశం వున్నప్పుడు కానీ క్యాంపుల్లో వారు పాల్గొనేలా మీరు చేయండి అలానే సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం వంటివి వాళ్ళకి అలవాటు చేయండి. అప్పుడు కచ్చితంగా న్యాయకత్వ లక్షణాలని పెంపొందించుకోగలుగుతారు.

పబ్లిక్ స్పీకింగ్ పిల్లలు:

పబ్లిక్ స్పీకింగ్ అలవర్చుకునేలా మార్చాలి. బయట మాట్లాడడం స్టేజ్ మీద మాట్లాడడం వంటి వాటిని వాళ్ళకి అలవాటు చేయండి. ఇలా అలవాటు చేస్తే కచ్చితంగా పిల్లలు లో నాయకత్వ లక్షణాలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news