తెరాసకు 70 స్థానాలు…ప్రొఫెసర్ నాగేశ్వర్…

-


తెలంగాణ ఎన్నికల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినకేసీఆర్ మరో సారి అధికారంలోకి రానున్నట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు. మహాకూటమే గెలుస్తుందని చాలా మంది పైకి చెబుతున్నా, లోలోపలమాత్రం తెలంగాణకే అనుకూల వాతావరణం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక పవనాలతో పాటు, ఎగ్జిట్ పోల్స్ ప్రకారందేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని భావించిన కేసీఆర్.. అదేజరిగితే తెలంగాణలో తెరాసకి  నష్టంవస్తుందని ఊహించి ముందస్తుకు వెళ్లారని నాగేశ్వర్ విశ్లేషించారు. మోదీపై వ్యతిరేకతకాంగ్రెస్ వైపు మళ్లుతోందని.. సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణ ఎన్నికలూజరిగుంటే టీఆర్‌ఎస్‌ పార్టీపై ఆ ప్రభావం కచ్చితంగా పడి..గులాబీ పార్టీ మరో 10 స్థానాలు కోల్పోయి ఉండేదని అభిప్రాయపడ్డారు. 60 సీట్లకు అటు ఇటుగా వచ్చేవన్నారు. 


కాంగ్రెస్ పుంజుకుంది…

ప్రజా కూటమితో పొత్తు ద్వారా ఇతర పార్టీల కంటే …కాంగ్రెస్అద్భుతంగా పుంజుకుందని నాగేశ్వర్ తెలిపారు. చాలా స్థానాల్లో హోరాహోరీపోటీనిచ్చిందని చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ ఓడినా.. ఓడి గెలిచినట్టేననిఅభిప్రాయపడ్డారు.  చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న వ్యతిరేకత దీనితోపాటుతెరాస వ్యతిరేక ఓట్లు బీజేపీవైపు వెళ్లినట్లు తెలిపారు.
సీమాంధ్రులుగంపగుత్తాగా తెదేపాకి వేయలేదు..
ఏపీలో అధికార, విపక్షపార్టీకి ఓటింగ్ శాతంలో తేడా 2 శాతమేనని గుర్తు చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్జనసేనకు, బీజేపీకి కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంటుదని చెప్పారు.సీమాంధ్ర ఓటర్లు ఎక్కడ ఉన్నా ఇదే సరళిలో పోలింగ్ ఉంటుందని చెప్పారు. తెదేపా అనుకూలవర్గం చంద్రబాబు మద్దతిచ్చిన కూటమి వైపు మొగ్గితే.. జగన్ అభిమానులు అంతే స్థాయిలో తెరాసపార్టీకి ఓటు వేస్తారని ఆయన విశ్లేషించారు.  సీమాంధ్రులు గంపగుత్తాగా తెదేపా కి ఎన్నడూ ఓటువేయరని తెలిపారు. ఏది ఏమైనా చంద్రబాబు ప్రచారం వల్ల మరో సారి తెలంగాణ పల్లెల్లోతెలంగాణ సెంటిమెంట్ రగిలిందన్నారు. దీంతో ఆ ఓట్లు తెరాసకు అనుకూలంగా మారాయని వివరించారు.ఏది ఏమైనా 11వ తారీఖున పూర్తి వివరాలు తేలనున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news