ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనకి చరమగీతం పాడిన ప్రజలు తెరాసకు 2014 ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం పై పలు ఆరోపణలు చేస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పి పాలనలో మరింత వేగం పెంచేందుకు తెరాస అధినేత కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ – తెదేపా తో పాటు మరో రెండు మూడు పార్టీలు కేసీఆర్ పై ఆరోపణలు చేస్తూ… ఇష్టవచ్చిన హామీలతో రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో మరో సారి కథన రంగంలోని దిగేందుకు కేసీఆర్ సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా మలి విడత ఎన్నికల ప్రచారానికి టీఆర్‌ఎస్ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాణళిక సిద్ధం చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి కేసీఆర్ సభలు, నియోజవకర్గ పర్యటనలపై పూర్తిస్థాయిలో ప్రణాళిక రూపొందించారు.
దాదాపు 23 రోజులపాటు నిరంతరం ఆయన సభల్లో పాల్గొనేలా ప్లాన్ రెడీ చేశారు. రోజుకు 3 నుంచి 4 సభల్లో కేసీఆర్ పాల్గొనే వీలుంది. మొత్తం 100 నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ఉంటుందని తెలిసింది. ఇక.. ప్రచారం చివరి 3 రోజులూ హైదరాబాద్‌పై దృష్టిసారించాలని నిర్ణయించారు. కేసీఆర్ సీన్ లోకి ఎంటర్ అయితే వార్ వన్ సైడ్ అవ్వడం ఖాయమంటున్నారు తెరాస నేతలు, సామన్య ప్రజలు. ఎన్నికల రణరంగంతో తెలంగాణ మరింత వేడెక్కుతోంది. మరో నెలరోజుల్లో నూతన ప్రభుత్వాన్ని ఎవ్వరు ఏర్పాటు చేస్తారో అనే విషయంలో ఈ నెల రోజులు కీలకం కానున్నాయి.