బెజవాడలో తెదేపా – జనసేన మధ్య ఫ్లెక్సీ ఫైట్

-

తెదేపా – జనసేన పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు బెజవాడలో రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. గతంలో నగర పోలీసులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఈ తరహా ప్రచారంతో కూడిన వివాదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి… తెదేపా – జనసేన నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.   తెదేపా నేత కాట్రగడ్డ బాబు.. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాన్‌ను విమర్శిస్తూ నగరంలో ఏర్పాటు చేసి ఫ్లెక్సీలకు కౌంటర్‌గా జనసేన అధికార ప్రతినిధి మండలి రాజేష్ ఆధ్వర్యంలో బెజవాడలో వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి.

‘పచ్చ తమ్ముళ్ల పిచ్చ పురాణం, వెంటాడుతున్న ఓటమి భయం, టీడీపీని ఓడించే జన సైనికులం అంటూ’ ఘాటు మాటలతో ఈ ఫ్లెక్సీలను రూపొందించారు. బందరు రోడ్డు, బెంజిసర్కిల్ ఇతర ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రాజకీయ వైరుధ్యం – చైతన్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రస్తుత మున్న పరిస్థితుల్లో ఈ తరహా వివాదాలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. దీంతో నగర కమిషనర్ ఇరువర్గాల వారిని పిలిపించుకుని కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సన్నహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news