సీట్ల పంచాయతీ తేలినట్లేనా?

-

మహాకూటమిలో సీట్ల పంచాయతీ కాస్త కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం తను కోరుకున్న స్థానాలను సాధించేందుకు  పట్టిన పట్టు విడవడం లేదు…దీంతో కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆయన్ను పిలిపించుకుని చర్చించిన విషయంత తెలిసిందే.. ఆ తర్వాత జరిగిన పరిణాలతో  తెలంగాణ జనసమితి (టీజేఎస్)కి 11 సీట్లలో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో 5, 6 స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉంటుందని కాంగ్రెస్‌ చెబుతున్నట్లుగా టీజేఎస్  నాయకులు వెల్లడించారు. అయితే  సీపీఐకి 4 స్థానాలకు ఇవ్వడానికి అంగీకరించడంతో వారు శాంతించినట్లు సమాచారం.

కాంగ్రెస్‌ ప్రతిపాదిస్తున్న స్నేహపూర్వక పోటీపై టీజేఎస్ కోర్‌ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు  కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఇప్పటికే 57 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. మిగతా అభ్యర్థుల జాబితాపై ఈ భేటీలో కసరత్తు చేస్తున్నారు. మిత్ర పక్షాలకు కేటాయించాల్సిన స్థానాలపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. కూటమిలో సీట్ల కేటాయింపు అంశం ఓ కొలిక్కివచ్చిన తర్వాత ఒకేసారి 119 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. మహాకూటమికి రాష్ట్రంలో రోజురోజుకి ఆదరణ పెరుగుతుందని దానిని అవకాశంగా తీసుకుని ఎలాగైన పార్టీలను బతికించుకోవాలని కూటమిలోని పార్టీలు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నాయి. ఇదిలా ఉంటే తెరాస మాత్రం అన్ని పక్కా వ్యూహంతో దూసుకెళ్లడంతో కేసీఆర్ వేగాన్ని కూటమి ఇంతవరకు అదుపుచేయలేకపోయిందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news