తెలంగాణ మంత్రి వర్గ సమావేశానికి డేట్ ఫిక్స్ చేసింది ప్రభుత్వం. ఈ నెల 5వ తేదీన తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్యక్షతన ఈ క్యాబినెట్ సమావేశం జరగనుండగా… తెలంగాణ మంత్రులు అందరూ ఈ కేబినెట్ సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయట. 5వ తేదీన ప్రగతిభవన్లో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో… టిఆర్ఎస్ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ కానుంది.
ఇక ఈ కేబినెట్ భేటీలో కీలక విషయాలను మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కేసిఆర్ వివిధ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది, ముఖ్యంగా కొత్త సెక్రటేరియట్ నూతన భవన నిర్మాణం, సాగు పద్ధతిలో వ్యవసాయం, కరోనా వైరస్ వ్యాప్తి, కరోనా వైరస్ నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు సహా మరికొన్ని అంశాలపై కూడా ఈ క్యాబినెట్ మీటింగ్ లో కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ మీటింగ్ అనంతరం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.