TRS కు పవన్‌ కళ్యాణ్‌ మద్దతు..దాసోజు చేరికపై ట్వీట్‌ !

-

శుక్రవారం శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ మంత్రి సమక్షంలో గులాబీ పార్టీలోకి మారారు. దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా గతంలో పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు.

ఇక నిన్న మళ్ళీ టిఆర్ఎస్ లో చేరారు. అయితే, దాసోజు శ్రవణ్ పార్టీ మార్పుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. శ్రవణ్ కు శుభాలు కలగాలి. తెలంగాణ నాయకుడు శ్రీ దాసోజు శ్రవణ్ గారు గొప్ప బలమైన నాయకుడు. గతంలో పీఆర్పీ నుంచి టీఆర్ఎస్ లోకి తెలంగాణ రాష్ట్ర ఆశయ సాధన కోసం చేరారు. శ్రవణ్ ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, నిత్యం తెలంగాణ అభివృద్ధి, ఆకాంక్షలు, తెలంగాణ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తూనే ఉంటారు. నా మిత్రుడు శ్రవణ్ భవిష్యత్తు లో తలపెట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని, రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటూ పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌ చేశారు. మరి పవన్ కళ్యాణ్ నిజంగానే శ్రవణ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారా, వెటకారంగా స్పందించారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version