నింగిలోకి పీఎస్ఎల్వీ సీ – 42

-

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఆదివారం రాత్రి 10.08 గంటలకు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ  – 42 ని పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు.

ఈ వెహికల్ ద్వారా బ్రిటన్ కు చెందిన 450 కిలోల నోవాసర్ , ఎన్1-4 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెడతారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ శనివారం మధ్యాహ్నం 1.08 గంటలకు ప్రారంభమైంది. నిరంతరాయంగా దాదాపు 33 గంటలపాటు కొనసాగిన మరుక్షణమే నింగిలోకి దూసుకెళ్లనుంది. నోవాసర్, ఎన్1-4 లు భూపరిశీలన ఉపగ్రహాలు. షార్ డైరెక్టర్ గా  ఎస్. పాండ్యన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొదటి ప్రయోగం.

Read more RELATED
Recommended to you

Latest news