కొలిగ్ కు కిడ్నీ దానం చేసేసింది..!

-

కంపెనీల్లో పని చేసే కొలిగ్స్ తో ఎంత వరకు సంబంధాలు ఉంటాయి. మా.. అంటే ఏదైనా బదులు తీసుకోవడం.. ఏదైనా అవసరాల్లో సాయం తీసుకోవడం.. అంతే కదా. అంత కంటే ఎక్కువ ఏముంటుంది. కానీ.. ఈ యువతి మాత్రం ఏకంగా తన కొలిగ్ కు కిడ్నీనే దానం చేసేసింది. షాక్ అయ్యారా? చదవండి ఇంకా ఉంది.

బెంగళూరులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నది దితీ లహరి. అదే కంపెనీలో పని చేస్తున్న మర్ష్ నెయిల్ సిన్హాతో తనకు పరిచయం ఏర్పడింది. లహరిది కోల్ కతా కాగా బెంగళూరులో జాబ్ కోసం వచ్చింది. సిన్హా కంటే లహరి సీనియర్. అయితే.. సిన్హాకు కిడ్నీ సమస్య ఉందట. ఇప్పుడు కాదు గత ఐదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నదట. ఈ విషయం లహరికి ఇన్ఫోటెక్ లో ఐటీసీ కోఆర్డినేటర్ గా ఉన్నప్పుడే తెలిసిందట. సిన్హా రెగ్యులర్ గా డయాలిసిస్ చేయించుకునేదట.

తర్వాత తన సమస్యతో జాబ్ కూడా చేయలేక ఇంటి దగ్గర నుంచి జాబ్ చేస్తా అని రిక్వెస్ట్ పెట్టుకుందట సిన్హా. అప్రూవల్ రావడంతో తన హోమ్ టౌన్ జార్ఖండ్ లో ఉన్న బొకారోకు వెళ్లిపోయింది. కానీ.. సిన్హాకు కిడ్నీ మార్పిడి ఖచ్చితంగా చేయాలని లేకపోతే తను బతకదని లహరి తెలుసుకున్నది.

అంటే ఎవరో ఒకరు తనకు కిడ్నీ దానం చేయాలి. సిన్హా తల్లిదండ్రులకు ఉన్న అనారోగ్య సమస్యల వల్ల వాళ్లు తనకు కిడ్నీ దానం చేయలేరు. ఇక సిన్హా బంధువులెవరూ తనకు కిడ్నీ దానం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో సిన్హాకు కిడ్నీ ఇవ్వడానికి సిన్హానే సిద్ధమైంది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు ముందు చెబితే ఒప్పుకోలేదు కానీ.. సిన్హా పరిస్థితి చెప్పిన తర్వాత వాళ్లు ఒప్పుకున్నారు. దాంతో పాటు లహరి తల్లి కూడా ఒకే కిడ్నీతో ఎంతో ఆరోగ్యంగా ఉంది. అయితే.. బంధువులు కాకుండా వేరే వాళ్లు కిడ్నీ దానం చేయడానికి కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోవు. కానీ.. వెస్ట్ బెంగాల్ లో అటువంటి సమస్య లేదు. కాకపోతే కొన్ని లీగల్ ప్రొసీడింగ్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

అలా తొమ్మిది నెలల పాటు అన్ని ప్రక్రియలు పూర్తి చేసి.. అనుమతులన్నీ వచ్చేశాక లహరి తన కిడ్నీని సిన్హాకు దానం చేసింది. ఇప్పుడు ఇద్దరూ ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. నా మేన కోడలు తన కొలిగ్ కు కిడ్నీ దానం చేసిందంటూ లహరి మామయ్య ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టడంతో వీళ్ల విషయం కాస్త అందరికీ తెలిసిపోయింది. నెటిజన్లు కూడా లహరిని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news