పెట్రోల్ – డీజిల్ రేట్లపై కాస్త ఉపశమనం కల్పించిన కేంద్రం

-

గత రెండుమూడు నెలలుగా  పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్ర దిగివచ్చి కాస్త ఊరట కలిగించింది.  పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.2.50 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి  అరుణ్‌జైట్లీ గురువారం ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సంబంధిత రాష్ట్రాలు కూడా సుంకాన్ని తగ్గించాల్సిందిగా సూచించారు. జైట్లీ సూచనలపై స్పందించిన గుజరాత్‌, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్‌, హరియాణా,మధ్యప్రదేశ్‌ ఛత్తీస్‌గఢ్‌,  హిమాచల్‌ప్రదేశ్‌, అసోం, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపుర కొద్ది నిమిషాల వ్యవధిలోనే స్పందించి రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై విధిస్తున్న సుంకాన్ని రూ.2.50చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో  గురువారం  అర్ధరాత్రి నుంచి లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.5 మేరకు తగ్గాయి.

పెట్రో రేట్లు పెరుగుదల ఎఫెక్ట్ సామాన్యుడి జీవన విధానంపై అధిక ప్రభావం చూపడంతో వారి నుంచి మోదీ పాలనపై సర్వత్రా విమర్శలు పెరగడంతో గమనించిన కేంద్ర కంటి తుడుపు చర్యగా కాస్త ఊరట కలిగించింది.

Read more RELATED
Recommended to you

Latest news