ప్రధాని మోడీ రష్యా,ఆస్ట్రియా పర్యటన ఖరారు

-

22వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ జూలై 8-9 తేదీల్లో మాస్కోకు వెళ్లనున్నారు.అదే తేదీల్లో రష్యాతో పాటు ఆస్ట్రియాలో అధికారిక పర్యటన ఉంటుందని భారత విదేశాంగశాఖ గురువారం ప్రకటించింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రధాని మోడీ రష్యాను పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధానంగా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం తర్వాత మోడీ ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.ఇరు దేశాధినేతలు 2 దేశాల మధ్య సంబంధాలను సమీక్షించనున్నారు.

పరస్పరం సమకాలీన ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక, రష్యా నుంచి ఆస్ట్రియాకు మోడీ వెళ్లనున్నారు. ఆస్ట్రియాకు ఇండియా ప్రధాని వెళ్లడం 41 సంవత్సరాలలో ఇదే మొదటిసారి. అక్కడి స్థానిక నేతలను కలసి ప్రముఖ వ్యాపారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.2 దేశాల పర్యటనల్లో ప్రవాస భారతీయులతో మోడీ సంభాషిస్తారని ఎంఈఏ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news