కొద్దీ రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రాజీనామా గురించి గందరగోళం అయింది. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాపై ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. అధిష్టానం సైతం పలుమార్లు ఇతనితో కూర్చుని చర్చించింది అయినా విషయం కొలిక్కి రాలేదు. పైగా రోజు రోజుకి ఎందుకు బాలినేని రాజీనామా చేశాడన్న టెన్షన్ పెరిగిపోతోంది. అయితే తాజాగా స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా ముందుకు వచ్చి తన రాజీనామాకు గల కారణాలను వెల్లడించారు. నేను టికెట్ ఇప్పించిన వారు నాపైనే అధిష్టానానికి ఫిర్యాదు చేయడం నన్ను చాలా బాధించింది అన్నారు.
నమ్ముకున్న నా ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడుతానని చెప్పారు. నాపై ప్రచారంలో ఉన్నా విధంగా నేను ఎవరిపైనా సీఎం కు ఫిర్యాదు చేసింది లేదు. ఇక నేను కోఆర్డినేటర్ పదవికి మూడు జిల్లాలకు న్యాయం చేయలేకపోవడం వలనే రాజీనామా చేశానని చెప్పాడు.