వాస్తు: వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది. చాలా మంది ఈ రోజుల్లో కూడా వాస్తుని అనుసరిస్తున్నారు.వాస్తుని అనుసరించడం వలన వివిధ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మీ ఇంట్లో కూడా తరచూ ఏదో ఒక సమస్య వస్తోందా..? అయితే కచ్చితంగా మీరు ఈ వాస్తు చిట్కాలని పాటించాల్సిందే. ఈ మార్పులను కనుక మీ ఇంట్లో చేశారంటే సమస్య నుండి బయట పడచు పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి రంగులు వేయించుకునేటప్పుడు అన్ని గదులకి ఒకే రంగు వేయకూడదు వాస్తు ప్రకారం వేరువేరుగా రంగులు ఉండాలి. ప్రకృతికి సంబంధించి ఫోటోలని ఇంట్లో ఉంచుకోవడం వలన గదుల్లోకి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అవకాశాలు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో చదువులో మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుని వస్తాయి. డబ్బుని కూడా మీరు పొందొచ్చు. బెడ్రూంలో ఎరుపు రంగు కానీ గులాబీ రంగు కానీ ఉంటే ప్రేమ నమ్మకం బాగా పెరుగుతాయి.
భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. ఇదే కాకుండా నీలం రంగు కానీ లైట్ గ్రే కలర్ కానీ ఉంచితే పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లలు యొక్క స్టడీ రూమ్ లో ఈ రంగులని వేయించండి. ఆరెంజ్ కలర్ పర్పుల్ కలర్ కూడా పిల్లలు బెడ్రూంలో వేస్తే మంచిది. ఇలాగే జాగ్రత్తలు తీసుకుంటే వాస్తు ప్రకారం సమస్యలు ఉండవు ఇబ్బందుల నుండి బయటపడవచ్చు ఆనందంగా జీవించొచ్చు.