బీటెక్ విద్యార్థులకు శుభవార్త..ఆ శాఖలో కొలువులు..పూర్తీ వివరాలు..

-

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు శుభవార్తలను అందిస్తూనే ఉంది..తాజాగా మరో ప్రభుత్వ శాఖలోని ఖాళీలు ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ శాఖలోని ఖాళీలను భర్తీ చేయనుంది. టీఎస్‌ఎన్పీడీసీల్‌ లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.. ఇందుకు సంభందించిన పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

ఖాళీలు, అర్హతలు..

*.నోటిఫికేషన్‌లో భాగంగా ఎలక్ట్రికల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న మొత్తం 82 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.
*. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్టికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎలక్టికల్‌ అండ్‌ ఎలక్టానిక్స్​​ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చే ఉండాలి.
* . అభ్యర్థుల వయసు 01-01-2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

*.  ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
*.  అప్లికేషన్‌ ఫీజుగా రూ. 200 చెల్లించాలి.
* .ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపుల కోసం 27-06-2022 నుంచి 11-07-2022 వరకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు 27-06-2022 నుంచి 11-07-2022 వరకు చేసుకోవాలి.
*. అభ్యర్థులలు హాల్‌ టికెట్లను 06-08-2022 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షను 14-08-2022వ తేదీన నిర్వహిస్తారు.
ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news