కాంగ్రెస్ పార్టీతో రానున్న ఎన్నికల్లో తెదేపా పొత్తు పై ఏపీ ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..భాజపా, కాంగ్రెస్ రెండూ తెదేపా కు సమదూరంలో ఉన్నాయి.. పొత్తుల విషయమై అధినేత నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు అభివృద్ధిని అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని వాటిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అడ్డుకోవడంతో వారి ఆటలు సాగడం లేదని అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో భాజపా నేత సోమువీర్రాజు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. నాడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం జీఎంఆర్ కు అప్పగిస్తేనే పనులు వేగంగా పనులు జరిగాయని గుర్తుచేశారు. వర్షాల కారణంగా వరద ముంపులో నష్టపోయిన ప్రతీ రైతుని, కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటోందని ఆయన చెప్పారు. పురుషోత్తపట్టణం రూ.16 వందల కోట్ల వ్యవయంతో త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలే మరోసారి మమల్ని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.