కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతో ఆరు గ్యారంటీలలో భాగంగా ఫ్రీ బస్ సదుపాయాన్ని కల్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి ఊహించని స్పందన వస్తుందని వీసి సజ్జనర్ తెలిపారు. ప్రస్తుతం 30 లక్షల కు పైగా మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని తెలిపాడు. ఈ పథకం అమలైన 11 రోజుల్లోనే దాదాపు మూడు కోట్ల మంది మహిళలకు పైగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పాడు. ఈ పథకం వలన గతంలో 69 శాతం ఉన్న ఓఆర్ ప్రస్తుతం 88 శాతానికి పెరిగిందని పేర్కొన్నాడు. అయితే కొన్ని డిపోలలో 100 శాతానికి పైగా ఓ ఆర్ నమోదయిందని తెలిపాడు. రద్దీ ఎక్కువ ఉండే మార్గాల్లో కొందరు ప్రయాణికులు ప్రమాదకర రీతిలో ప్రయాణం చేస్తున్నారని అలా చేయడం శ్రేయస్కరం కాదని ఆయన చెప్పాడు.
త్వరలోనే 2050 బస్సులు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని అందులో 1050 డీజిల్ బస్సులు కాగా ఇంకో 1000 ఎలక్ట్రికల్ బస్సులు.విడతల వారిగా వీటిని తీసుకువస్తామని… బిగ్బాస్ షో ఫైనల్స్ తర్వాత కొందరు ప్రభుత్వ బస్సుల అద్దాలను పగలగొట్టడంపై ఆయన మండిపడ్డారు.