ఏపీలో సంచలన సర్వే.. టీడీపీ కి 141 పక్కా

-

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. కాగా ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ పై పడింది. ఈసారి వై నాట్ 175 అని వైసీపీ అంటోంది. రెండోసారి అధికారం మాదే అంటున్నారు ఆ పార్టీ నేతలు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా అధికారం కోసం పొత్తులు, ఎత్తులతో వ్యూహ రచన చేస్తోంది. ఇన్నిరోజులు సైలెంట్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం ఆలస్యంగా రేసులోకి వచ్చింది. తెలంగాణలో విజయం తెచ్చిన ఊపుతో ఏపీలో కూడా ఎన్నో కొన్ని సీట్లు సాధిస్తామనే సంకేతాలు పంపిస్తోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో ఏపీలో ఒక సంచలన సర్వే విడుదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కొత్త కొత్త సర్వేలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చేది ఎవరు..? జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌…వీరిలో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేది ఎవరు..? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఏపీ ప్రజలే కాకుండా యావత్ తెలుగు సమాజం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కాండ్రేగుల ప్రసాద్ ఓ సర్వేను బయట పెట్టారు.తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు నేపథ్యంలో ఏపీలో ఏ పార్టీ గెలుపు సాధిస్తుందన్న అంశంపై నియోజకవర్గాల వారీగా సర్వే ఫలితాలను వెల్లడించారాయన. రానున్న ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ స్థానాలను కోల్పోతుందని చెప్పారు. వైసీపీ కేవలం 34 స్థానాలకే పరిమితమవుతుందని కుండబద్దలు కొట్టారు. తెలుగుదేశం, జనసేన కూటమి ఏకంగా 141 స్థానాలతో తిరుగులేని విజయం సాధిస్తుందని తేల్చడం విశేషం.ఇప్పుడు ఈ సర్వే ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపుతోంది.జగన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు,పెరిగిపోతున్న ధరలు,అవినీతి ఆరోపణలు వెరసి వైసీపీ ఓడిపోవడం ఖాయమని ఈ సర్వే తేల్చింది.

తాజాగా మరో సంచలన సర్వే కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించింది.తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పార్థా దాస్ అనే సెఫాలజిస్ట్ సేకరించిన సర్వే శాంపిల్ వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎవరు అయితే బాగుంటుందని శాంపిల్లను తీయగా చంద్రబాబు నాయుడుకి 38 శాతం మద్దతు తెలిపారు.అలాగే వైఎస్ జగన్ కి కూడా 38 శాతం మంది ఓటు వేయడం గమనార్హం. 15 శాతం మంది లోకేష్ సీఎం అయితే బాగుండని అంటున్నారు.మరో 10 శాతం మంది పవన్ కి మద్దతుగా నిలిచారు.

ఇక ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుందని అడగ్గా.. టీడీపీకి అనుకూలంగా 51 శాతం మంది ఓటేసారు. వైఎస్సార్సీపీ 36 శాతం,జనసేనకు 10 శాతం,ఇతరులు 3 శాతం ఓట్లు పొందారు. ఎంపీ స్థానాలకు నిర్వహించిన సర్వేలోను టీడీపీ కి అనుకూలంగానే ఓట్లవచ్చాయి. టీడీపీ 53 శాతం,వైఎస్సార్సీపీ 38 శాతం, జనసేన 6 శాతం, కాంగ్రెస్ కి 3 శాతం మంది జైకొట్టారు. ప్రధాన మంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. రాహుల్ గాంధీ కి ఏకంగా 43 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. మోదీకి 40 శాతం,నో ఛాయిస్ కింద 18 శాతం మంది అభిప్రాయాలను వెల్లడించారు.

తెలంగాణలో మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తారనుకుంటే.. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.అక్కడ హస్తం పార్టీ గెలుపును ముందుగానే ఊహించింది ‘చాణక్య పొలిటికల్ కన్సల్టెన్సీ’. ఈ సంస్థకు చెందిన సెఫాలజిస్ట్ పార్థా దాస్.. ఇప్పుడు ఆంధ్రాలో గెలుపు అంచనాలను పసిగట్టే పని మొదలుపెట్టారు. తెలంగాణ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల వారీగా ఈయన ముందే అంచనాలను వెలువరించగా.. అవి ఎన్నికల ఫలితాలకు దాదాపు దగ్గరగా వచ్చాయి. దీంతో ఆంధ్రాలో పరిస్థితిని తెలుసుకునేందుకు రాజమండ్రి సిటీలో చేసిన ఈయన సర్వే ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.రాజమండ్రి ప్రజలు టీడీపీ వైపు మొగ్గు కనబరుస్తున్నారని దీన్ని బట్టి అర్థం అవుతోంది. ఇప్పుడు అక్కడ టీడీపీ నుంచి ఆదిరెడ్డి భవాని ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే నెక్స్ట్ సీఎం ఛాయిస్ విషయంలో జగన్, చంద్రబాబు ఇద్దరూ సమఉజ్జీలుగా ఉండటం మాత్రం ఆసక్తికర పరిణామం. ఎన్నికలకు మరో రెండు నెలలు ఉన్న నేపథ్యంలో ఈ అంచనాలు మారే అవకాశాలు లేకపోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news