రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత లేదు… రైతులపై లాఠీఛార్జ్ జరగలేదు : మంత్రి తుమ్మల

-

రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతోనే కొందరు రైతులతో క్యూలో చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టిస్తున్నారని మంత్రి తుమ్మల ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత లేదని, ఆదిలాబాద్లో రైతులపై లాఠీఛార్జ్ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఒకే బ్రాండ్ విత్తనాలు కావాలని రైతులు డిమాండ్ చేయడంతోనే ఇబ్బంది ఏర్పడిందని ఆయన వివరించారు. రుణమాఫీ విషయం ఆర్బీఐతో చర్చిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

కాగా, సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు..ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు లైన్ లో నిలబడితే..సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా అని విమర్శించారు. గత పదేళ్లపాటు.. 10 నిమిషాల్లో అందిన విత్తనాలు..10 గంటలపాటు పడిగాపులు పడినా అందించలేరా ??రంగారెడ్డి నుంచి.. కామారెడ్డి దాకా..రైతులకు ఏమిటీ కష్టాలు.. ఇంకెన్నిరోజులు ఈ కన్నీళ్లు..దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ.. అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తారా ??బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేస్తారా ??ఇప్పటికైనా.. సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించండి..!బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా కళ్లెం వేయండి అని ఎక్స్(ట్విట్టర్) లో కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news