పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు గుండె దడ పుట్టిస్తున్నాయి. ధరలు అంతకంతకూ పెరుగుతూ వినియోగదారుల జేబుకు చిల్లులు పెడుతున్నాయి. దేశ రాజధానిలో పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.63 కి చేరింది. ఇక డీజిల్ ధర 24 పైసలు పెరిగి లీటర్ ధర రూ.73.54 కు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో … తెలంగాణ(హైదరాబాద్)లో లీటర్ పెట్రోల్ ధర రూ.86.18, డీజిల్ ధర రూ.79.73 కాగా, విజయవాడలో పెట్రోల్ ధర రూ.85.14, డీజిల్ ధర రూ.78.63కు చేరింది. ఈ నెల ప్రారంభం నుంచి ఒక్క సెప్టెంబర్ 5 మినహా ప్రతీ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ…సెంచరీకి చేరువ అవుతున్నయి. పెట్రో ధరలపై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సామాన్యులు తమ గోడుని ఎవరికి చెప్పుకోలేక ప్రయాణాలు తగ్గించుకుంటున్నారు.