నయనతారతో గొడవపై నోరు విప్పిన మారుతి

-

ఈ రోజుల్లో సినిమా నుండి శైలజా రెడ్ది అల్లుడు సినిమా వరకు దర్శకుడిగా కెరియర్ గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు మారుతి. నాగ చైతన్య హీరోగా తన డైరక్షన్ లో వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా మిక్సెడ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే కలక్షన్స్ విషయంలో ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబడుతుంది. చైతు ఫ్రెష్ లుక్ తో పాటుగా మారుతి మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వచ్చింది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో బాబు బంగారం టైంలో నయనతారతో గొడవ గురించి బయట పెట్టాడు మారుతి. తాము చిన్న దర్శకులమే తమని రెస్పెక్ట్ ఇవ్వకున్నా ఓకే కాని వెంకటేష్ లాంటి స్టార్ హీరోయిన్ కు నయనతార రెస్పెక్ట్ ఇవ్వలేదు అందుకే ఆమెతో గొడవ పడ్డానని చెప్పుకొచ్చాడు మారుతి. ఇక ఆర్య సినిమా బన్నితో కలిసి డిస్ట్రిబ్యూట్ చేశానని ఆ సినిమా వల్లే తాను ఇప్పుడు దర్శకుడిగా మారగలిగానని తన లైఫ్ లో చాలా కష్టాలు అనుభవైంచి వచ్చానని చెప్పిన మారుతి చక్రాల బండి మీద అరటి పండ్లు కూడా అమ్మిన రోజులను గుర్తుచేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news