లైవ్‌లో ఏడ్చేసిన అషురెడ్డి.. ప‌వ‌న్ కోసం ఏకంగా!

-

సేమ్ టు సేమ్ స‌మంత లాగా ఉండ‌టంతో త్వ‌ర‌గా పాపుల‌ర్ అయిపోయింది అషురెడ్డి. సోష‌ల్ మీడియా ద్వారా ఫాలోయింగ్ తెచ్చుకుని ఏకంగా బిగ్‌బాస్‌లోచోటు సంపాదించింది. అంతే ఇక అక్క‌డి నుంచి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ల‌భించింది. అషురెడ్డి అంటే యూత్‌లో తెలియ‌ని వారంటూ ఉండ‌రు. త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో వీడియోలు చేస్తూ కుర్ర‌కారును బుట్ట‌లో వేస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా వార్త‌ల్లో నిలిచింది.


జనసేన అధినేత, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ కరోనా బారిన పడిన సంగతి మ‌నంద‌రికీ తెలిసిందే. అయితే ఈ విషయమై అషురెడ్డి రియాక్ట్ అవుతూ తీవ్ర భావోద్వేగానికి గురైన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అషుకు పవన్ కళ్యాణ్ అంటే ఒకరకమైన పిచ్చి. తన ప్రైవేట్ పార్ట్‌పై పవన్ కళ్యాణ్ పచ్చబొట్టు పొడుపించుకుని అప్పట్లో ర‌చ్చ‌ర‌చ్చ చేసింది ఈ హాట్ బ్యూటీ. అంతే కాదు ప‌వ‌నే త‌న ఫ‌స్ట్ ల‌వ్ అని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. ప‌వ‌న్ ఒప్పుకుంటే ఆయ‌న‌కు నాలుగో భార్య‌గా ఉంటాన‌ని సంచ‌ల‌న కామెంట్లు చేసింది. ఇక పవన్‌కి కరోనా పాజిటివ్ అని తెలియడంతో లైవ్ లోనే కన్నీరు పెట్టుకుంటూ ఓ వీడియోని రిలీజ్ చేసింది అషు బేబీ.
ప‌వ‌న్ ఆరోగ్యం కోసం తాను ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఇంకేమీ చేయలేన‌ని చెప్పింది. పవన్ త్వరలోనే తిరిగి పూర్తి ఆరోగ్యంతో మన ముందుకొస్తార‌ని ధీమా వ్య‌క్తం చేసింది. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఎవరికి వారు తమదైన స్టైల్ కామెంట్ చేస్తున్నారు. అయితే మ‌రి కొంద‌రు మాత్రం అషుకి ప‌వ‌న్‌పై ప్రేమ అలా ఉందంటూ సింప‌తీ తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news