టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీమిండియాకు తను అద్భుతమైన ఆట తీరుతో ఎన్నో విజయాలను అందించాడు. కాగా, మహమ్మద్ సిరాజ్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మహమ్మద్ సిరాజ్ సింగర్ జనై బోస్లేతో దిగిన ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.
జనై బోస్లే ఇన్ స్టాలో పోస్ట్ చేసిన తన బర్త్డే సెలబ్రేషన్ ఫోటోలలో హైదరాబాది స్పీడ్ స్టార్ మహమ్మద్ సిరాజ్ తో క్యాండిడ్ ఉంది. దీంతో ఫాస్ట్ బౌలర్ తో ఆశా భోస్లే మనవరాలు డేటింగ్ లో ఉందనే కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ఈ కామెంట్లపై ఇప్పటివరకు సిరాజ్ వైపు నుంచి కానీ జనై బోస్లే నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు.