కొంతమంది తమకు ఇష్టమైన వారిని కోల్పోతే ఆ భాధను భరించలేరు.. అందుకు ఏదోకటి చెయ్యాలని అనుకుంటారు..ఇప్పుడు మనం చెప్పుకొనే యువతి కూడా అంతే.. తనకు ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించే తాత చనిపోయాడు.. అతను రాత్రి సైకిల్ మీద వెళ్తున్నాడు.. చీకటిలో కనిపించక కారు వెనకాల వచ్చి బలంగా గుద్దేశింది.. దాంతో అతను అక్కడే ప్రాణాలను విడిచాడు. సైకిల్‌కు లైట్లు లేకపోవడం, చీకటి కారణంగా కారు డ్రైవర్ తన తాతను గమనించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. తాత మరణం నుంచి కోలుకోవడానికి ఖుషికి చాలా సమయమే పట్టింది. అదే సమయంలో తన తాతలా మరొకరు ప్రాణాలు కోల్పోకూడదని భావించింది. అందుకే వీలైనప్పుడల్లా వీధులు, ఫుట్‌పాత్‌ల ఇలా ప్లకార్డు పట్టుకుని తిరుగుతోంది.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోవెలుగు చూసింది.. యువతి పేరు ఖుషీ పాండే. వయసు 22 సంవత్సరాలు.. దయచేసి సైకిళ్లకు లైట్లు అమర్చుకోండి’ అని ఆ ప్లకార్డులో రాసి ఉంది. ఇంతటితో ఆగని ఖుషి తనవంతుగా ఉచితంగా సైకిళ్లకు లైట్లు బిగిస్తోంది. అలా ఇప్పటివరకు సుమారు 1500కు పైగా రెడ్ లైట్స్‌ను అమర్చిందట. ప్రస్తుతం ఆ యువతికి సంబంధించిన వీడియోలు,ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఖుషి చేస్తున్న మంచి పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మా తాత లాగా చనిపోకూడదని ఇలాంటి ఆలోచనతో ముందుకు వచ్చింది..ఆ వీడియోలో అమ్మాయి మాట్లాడుతూ..మా తాత లాగా ఎవరు చనిపోకూడదు అంటూ సైకిళ్లకు లైట్లు బిగిస్తున్నాను’ అని ఎమోషనలవుతోంది ఖుషి. కాగా ఖుషి సైకిళ్లకు బిగిస్తోన్న ఒక్కొక్క లైటు ఖరీదు సుమార 450 రూపాయలు. చదువుకుంటూనే రెండు చోట్ల పార్ట్ టైమ్ వర్క్ చేస్తూ ఇందుకు కావల్సిన మొత్తాన్ని సేకరిస్తోంది. లైట్లు ఉచితంగా అందించడమే కాకుండా అన్ని సైకిళ్లకు ఇటువంటి లైట్లను తప్పనిసరి చేయాలి అభ్యర్థిస్తూ రోడ్డు భద్రతా అధికారులకు లేఖ రాసింది.. ఇంకా ఎన్నెన్నో చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటుంది..