డీ శ్రీనివాస్..రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోసం అనేక సేవలు చేసిన నేత..వైఎస్సార్ తో సమానంతో పార్టీ కోసం నిలబడిన నేత. ఉమ్మడి ఏపీ పిసిసి అధ్యక్షుడుగా పనిచేసి వైఎస్సార్ తో పాటు 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశారు.
అలా కీలకపాత్ర పోషించిన డీఎస్ ఇప్పుడు రాజకీయంగా కాస్త వెనుకపడ్డారు. అయితే 2004 వరకు వరుసగా గెలుస్తూ వచ్చిన ఈయన 2009 ఎన్నికల్లో ఓడిపోయారు..ఆ తర్వాత 2010, 2012 ఉపఎన్నికల్లో ఓడిపోయారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ అర్బన్ సీటులో పోటీ చేసి ఓడిపోయారు. అలా ఓడిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలి బిఆర్‌ఎస్ లోకి వెళ్లారు. అక్కడ రాజ్యసభ పదవి దక్కింది.
కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా డిఎస్ తనయుడు అరవింద్ బిజేపి నుంచి పోటీ చేసి..కవితని ఓడించారు. అప్పుడు డిఎస్ బిఆర్‌ఎస్ లో ఉండి..తన తనయుడుకు సహకరించారని
ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన నిదానంగా బిఆర్‌ఎస్ పార్టీకి దూరమయ్యారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చూశారు గాని..మధ్య లో కాస్త బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమైందని కథనాలు వచ్చాయి. కానీ ఆయన పార్టీ చేరడం లేదని, ఆయన మరో తనయుడు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే డిఎస్ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించే పరిస్తితి ఉంది.
ఇక డిఎస్ తనయుడు రాకతో నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి కాస్త పట్టు దొరుకుతుందనే చెప్పాలి. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్, రూరల్ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుంది. కానీ అటు డిఎస్ మరో తనయుడు అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. అక్కడ బిజేపిని గెలిపించాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. దీంతో డిఎస్ తనయులు పోటీ పడాల్సిన పరిస్తితి వస్తుంది. చూడాలి మరి నిజామాబాద్ పోరు ఎలా ఉండబోతుందో.