100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్ళు.. చంద్రబాబు ప్రభుత్వం కీలక ప్రకటన !

-

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రాబోయే 100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. గృహనిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో 8.04 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.

1.28 lakh houses in 100 days Chandrababu government’s key announcement

వీటిలో 5.76 లక్షలు ఇంకా మొదలుపెట్టలేదు. వీటికి రూ.2,000 కోట్లు అవసరం’. అని పేర్కొన్నారు. పేదవాడికి ఇళ్లను అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందు కెళ్తుందని మంత్రి చెప్పారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం సాయంత్రమే దిల్లీ చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్ర అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు తగిన సాయం కోరే ఉద్దేశంతో మోదీతో భేటీ కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news