ఏపీలో భారీ వర్షాలు వరదలు రైతులకు అకాల నష్టం మిగిల్చిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక విపక్షాలు ఏపీ ప్రభుత్వ లక్ష్యంగా వరుస ఆరోపణలు చేస్తున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వరుసగా పర్యటనలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి తీవ్రంగా విమర్శించారు. నాపై రూ.6లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు అన్నారు.
తర్వాత రూ.లక్ష కోట్లే అన్నారు అని, ఎక్కడా ఏమీ లేదని తెలిసి ఫైబర్ గ్రిడ్ లో అవినీతి అన్నారని, అక్కడా ఏమీ లేదని తెలిసి చివరకు ట్రాక్టర్ రాష్ డ్రైవింగ్ కేసు పెట్టారు అని ఆయన విమర్శించారు. ట్రాక్టర్ తో కూడా రాష్ డ్రైవింగ్ చేయొచ్చని ఆ కేసు చూసాకే తెలిసింది అని ఆయన విమర్శించారు. రైతుల బావుల వద్ద మీటర్లు పెడితే పీకేస్తామని ఆయన పేర్కొన్నారు.