ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో జనసేన పార్టీ కూడా సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తుంది. అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య లోకల్ వార్ నెలకొంది. నేటి తో ఎంపీటిసీలకు నామినేషన్ గడువు ముగిసింది. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ తన అభ్యర్ధులను తమకు పట్టున్న ప్రాంతాల్లో నిలిపింది. అధికార పార్టీ ఇబ్బందులను తట్టుకుని నిలబడే ప్రయత్నం చేస్తుంది.
ఈ క్రమంలో ఓ 70 ఏళ్ల బామ్మ జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా నల్లమోతు భారతి నామినేషన్ వేశారు. 70 ఏళ్ల భారతి జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితురాలై ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
“పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా శ్రీమతి నల్లమోతు భారతి గారు నామినేషన్ వేశారు. 70 ఏళ్ల భారతి గారు జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితురాలై బరిలో నిలిచారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆమెను అభినందించారు” అని జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.