క‌రోనా ఉందేమోనని బ‌తికిఉన్న 6వేల కోళ్ల‌ను గొయ్యి తీసి పూడ్చి పెట్టాడు..వైర‌ల్ వీడియో..!

-

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఏమోగానీ మ‌న దేశంలో పౌల్ట్రీ రైతులు తీవ్ర న‌ష్టాలు చ‌వి చూస్తున్నారు. అస‌లే ధర లేక చాలా న‌ష్టానికి వారు కోళ్ల‌ను అమ్ముకుంటుంటే.. క‌రోనా వ‌ల్ల కోళ్ల ధ‌ర‌లు విప‌రీతంగా ప‌డిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. కాగా క‌ర్ణాట‌క‌లో ఓ పౌల్ట్రీ రైతు క‌రోనా ఉందేమోన‌న్న భ‌యంతో ఏకంగా బ‌తికి ఉన్న వేల కోళ్ల‌నే పూడ్చిపెట్టాడు. ఈ సంఘ‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

farmer dumped 6000 live chicken into pit because of corona fear

క‌ర్ణాట‌క‌లోని న‌ల్సూర్ అనే గ్రామానికి చెందిన న‌జీర్ అహ్మ‌ద్ అనే పౌల్ట్రీ రైతు క‌రోనా ఉందేమోన‌న్న భ‌యంతో త‌న ఫాంలో ఉన్న 6వేల బ‌తికి ఉన్న కోళ్ల‌ను స‌జీవ స‌మాధి చేశాడు. ఓ ట్రాక్ట‌ర్ ద్వారా వాటిని నిర్మానుష్య ప్ర‌దేశానికి త‌ర‌లించి పెద్ద గొయ్యి త‌వ్వి కోళ్ల‌ను అందులో పూడ్చి పెట్టాడు. అత‌ను తాను చేసిన ప‌నిని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో నెట్‌లో వైర‌ల్‌గా మారింది.

కాగా న‌జీర్ తాను చేసిన ప‌ట్ల స్పందిస్తూ.. ప్ర‌స్తుతం కోళ్ల ధ‌ర‌లు భారీగా ప‌డిపోయాయ‌ని, ఒక కోడ్ని రూ.5, రూ.10కి అడుగుతున్నార‌ని, అలాగే త‌న కోళ్ల‌కు క‌రోనా ఉందేమోన‌ని అనుమానంగా ఉంద‌ని, అందుకే వాటిని పూడ్చి పెట్టాన‌ని చెప్పాడు. అయితే న‌జీర్ చేసిన ప‌నిని చాలా మంది త‌ప్పు ప‌డుతున్నారు. క‌రోనా ఉందేమోన‌న్న అనుమానంతో అన‌వ‌స‌రంగా కోళ్ల‌ను చంపేశావ‌ని అత‌నిపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news