హై కోర్టుకు మ‌రో 10 మంది న్యాయ‌మూర్తులు.. రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వులు జారీ

-

తెలంగాణ రాష్ట్ర హై కోర్టులో మ‌రో 10 మంది న్యాయ‌మూర్తులు నియామ‌కం అయ్యారు. ఇటీవ‌ల సుప్రీం కోర్టు సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని కొలిజీయం.. తెలంగాణ హై కోర్టులో 12 మంది న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించాల‌ని సిపార్సు చేసింది. కాగ కేంద్ర ప్ర‌భుత్వం 10 మంది న్యాయ‌మూర్తుల నియ‌మ‌కానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా గా రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ కూడా దీనికి ఆమోదం తెలిపారు. అంతే కాకుండా ఉత్త‌ర్వుల‌ను కూడా జారీ చేశారు.

దీంతో 10 న్యాయ‌మూర్తులు తెలంగాణ హై కోర్టుకు నియామ‌కం అయ్యారు. నూతనంగా నియామకైన న్యాయమూర్తుల్లో న్యాయవాదుల కోటా నుంచి కాసోజు సురేందర్‌, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌ కుమార్‌, ఎన్‌.వి. జువ్వాడి శ్రీదేవి, ఎన్‌.వి శ్రావణ్‌కుమార్​ ఎంపికయ్యారు. అదే విధంగా న్యాయాధికారుల కోటా నుంచి జి.అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్‌రెడ్డి, డాక్టర్‌ దేవరాజ్‌ నాగార్జున్‌ ఉన్నారు. కాగ వీరితో తెలంగాణ రాష్ట్ర హై కోర్టులో న్యాయ‌మూర్తుల సంఖ్య 29కి చేరింది. కాగ ఉండాల్సింది.. మాత్రం 42.

Read more RELATED
Recommended to you

Latest news