నేడు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలవనున్న తెలంగాణ మంత్రులు

-

ఢిల్లీ: నేడు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలవనున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి కి చెందిన ధాన్యం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా కోరనుంది మంత్రుల బృందం. ఇవాళ ఉదయం 12 గంటల సమయంలో.. ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇక ఈ సమావేశంలో అనంతరం మీడియాతో తెలంగాణ మంత్రులు మాట్లాడనున్నారు.

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తో భేటీ అనంతరం.. కేంద్ర మంత్రి షేకావత్‌, ఇతర మంత్రులతో తెలంగాణ మంత్రులు సమావేశం కానున్నారు. తెలంగాణ మంత్రుల ఢిల్లీ టూర్‌ మరో 4 రోజులు కొనసాగే ఛాన్స్‌ ఉంది. కాగా.. ఇటీవలే సీఎం కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించి.. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేస్తున్న అన్యాయాలను మీడియా ముందు బయట పెట్టారు.

మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇండియా అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని… కచ్చితంగా బిజెపి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని దించేందుకు… ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలని తాము ఇంకా అనుకో లేదన్నారు.కానీ ఓ కొత్త రూపంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని కేసీఆర్ ప్రకటించారు. అది మరో జాతీయ పార్టీ రూపంలో కూడా రావచ్చని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news