ఇండియా వరల్డ్ కప్ కి పదేళ్ళు..సోషల్ మీడియాలో ట్రెండింగ్

-

మీరు క్రికెట్ ప్రేమికులైతే, ఈ రోజును అస్సలు మరచిపోలేరు. ఎందుకంటే ఈ రోజు, 2011 సంవత్సరంలో, భారతదేశం శ్రీలంకను ఓడించి, రెండోసారి క్రికెట్ ప్రపంచ కప్ గెలిచింది. భారత జట్టు సాధించిన ఈ అద్భుతమైన విజయాన్ని భారతదేశం అంతటా ఘనంగా జరుపుకున్నారు. ఈ ప్రపంచ కప్‌లో భారత ఆటగాళ్ళు నమోదు చేసిన విజయాలను ఏ క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు. సోషల్ మీడియాలో నిన్న అర్ధరాత్రి నుంచి భారత ప్రపంచ కప్ గెలిచిన క్షణాలను షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా, # WorldCup2011 ట్విట్టర్‌ లో ట్రెండింగ్‌లో ఉంది. టీమ్ ఇండియా మొట్టమొదటి సారి కపిల్ దేవ్ నేతృత్వంలో 1983లో వరల్డ్ కప్ గెలిచింది. మళ్ళీ ఆ ప్రపంచ కప్ ను ముద్దాడ డానికి 28 ఏళ్లు పట్టింది.

సరిగ్గా ఇదే రోజున 2011లో ప్రపంచ కప్ అందుకుని చరిత్ర సృష్టించింది. ఇక అప్పటి మ్యాచ్ విషయానికి వస్తే గ్రూప్‌ ఏలో రెండో స్థానంలో నిలిచిన శ్రీలంక, గ్రూప్ బిలో రెండో స్థానంలో నిలిచిన ఇండియా ఫైనల్స్‌ కు చేరడం విశేషం. ఈ ఫైనల్ కంటే ముందే సెమీ ఫైనల్ మ్యాచ్ మొహాలీలో జరిగింది. ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ కి ఫైనల్ కి మించిన క్రేజ్ లభించింది. ఇప్పటి దాకా ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియాను ఓడించలేని కపోయిన పాకిస్తాన్.. ఆ మ్యాచ్‌ లో కూడా ఓడిపోయింది. ఇక ఫైనల్స్ కి చేరిన  ఇండియా వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో శ్రీలంక మీద గెలిచింది. భారతదేశానికి ఈ ప్రపంచ కప్ గెలవడంలో యువరాజ్ సింగ్ అతిపెద్ద పాత్ర పోషించాడు. 

Read more RELATED
Recommended to you

Latest news