డిగ్రీ పాసైన విద్యార్థినులకు రూ.50 వేలు.. అప్లై ఎలా చేసుకోవాలంటే..?!

-

బాలికలు, మహిళలకు విద్య చాలా ముఖ్యమైనది. అందుకే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తోంది. ఈ పథకాల ద్వారా విద్యార్థినులకు దుస్తులు, పుస్తకాలు, సైకిల్, స్కాలర్‌షిప్ వంటి ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు కూడా బాలిక విద్యను ప్రోత్సాహించడానికి రూ.25 వేలను నుంచి రూ.50 వేల వరకు ప్రోత్సాహకాలను ఇస్తున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే పలు పథకాలను ప్రారంభించారు. వీటిలో ‘బేటి బచావో బేటి పడావో’ ప్రచారంలోని ‘సుకన్య సమృద్ధి యోజన’ కీలకమైనది. ఈ పథకాన్ని లక్షలాది మంది తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ కూతుళ్ల మెరుగైన భవిష్యత్‌కు అడుగులు వేస్తున్నారు.

విద్యార్థినులు
విద్యార్థినులు

బాలిక విద్యలో బీహార్ ప్రభుత్వం కూడా అనేక పథకాలు ప్రారంభించింది. ఇందులో ‘ముఖ్యమంత్రి కన్యా ఉత్తన్ యోజన’ ఒకటి. ఈ పథకంలో 10, 12, గ్రాడ్యుయేషన్ పాసైన విద్యార్థినులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులకు రూ.25 వేలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థినులకు రూ.50 వేల ప్రోత్సాహకం ఇస్తున్నట్లు బీహార్ ప్రభుత్వం పేర్కొంది. గతంలో ఇంటర్ పాసైతే రూ.10 వేలు, డిగ్రీ పాసైతే రూ.25 వేలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు నితీష్ ప్రభుత్వం ప్రోత్సాహకాలను పెంచింది. దీని కోసం అదనపు బడ్జెట్‌ను కూడా కేటాయించింది. 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీహార్ రాష్ట్ర విద్యార్థినులు ‘ముఖ్యమంత్రి కన్యా ఉత్తన్ యోజన’ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిన ఇంటర్, డిగ్రీ విద్యార్థినులందరికీ ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి. ఈ పథకంలోకి చేరాలనుకునే వారు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని, దీని కోసం బీహార్ ప్రభుత్వం ఈ-కళ్యాణ్ పోర్టల్‌ని కూడా ప్రారంభించింది.

దరఖాస్తు చేసుకోండిలా..
మొదటగా ఈ-కళ్యాణ్ పోర్టర్ అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. హోమ్ పేజీలో ముఖ్యమంత్రి కన్యా ఉత్తన్ యోజనా పథకాన్ని క్లిక్ చేయాలి. ఇందులో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇంటర్/డిగ్రీకి సంబంధించిన మార్కులు నింపాలి. పూర్తి సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్, మార్క్‌షీట్, ఆధార్ లింక్‌డ్ మొబైల్ నంబర్, ఫోటో తప్పనిసరి.

Read more RELATED
Recommended to you

Latest news