బిజెపి అగ్ర నాయకత్వంలో మార్పులు, అమిత్ షా స్థానంలో…!

-

పార్లమెంట్ ఎన్నికల్లో 303 స్థానాలు గెలిచాం కదా అనే ఆనందం బిజెపి కార్యకర్తలకు ఆరు నెలలు కూడా ఉండలేదు పాపం. మహారాష్ట్రలో, హర్యానాలో జరిగిన ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుందని భావించారు అంతా. కాని పాపం ఏమైందో ఏమో గాని మహారాష్ట్రలో ఎక్కువ స్థానాలు సాధించింది గాని శివసేన దూరం కావడంతో అధికారం చేపట్టలేదు. హర్యానాలో జేజేపి సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

బెంగాల్ లో 17 స్థానాలు పార్లమెంట్ కి గెలిచింది గాని మూడు అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికల్లో గెలవలేదు ఆ పార్టీ. ఆ బాధను మింగక ముందే ఝార్ఖండ్ ఎన్నికల్లో ఊహించని విధంగా షాక్ తగిలింది. అధికారం కోల్పోయింది అక్కడ కూడా. దీనితో ఇప్పుడు బిజెపి నాయకత్వంలో మార్పులు చెయ్యాలని భావిస్తుంది. అమిత్ షా హోం మంత్రి అయిన తర్వాత పార్టీ మీద ఎక్కువగా దృష్టి పెట్టలేకపోయారని భావిస్తున్నారు కమలం పెద్దలు.

కీలక బిల్లులు ఉండటం, వాటిపై ఆందోళనలు జరగడం, ఇదే సమయంలో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు రోజుల వ్యవదిలో జరగడంతో షా ఇబ్బంది పడ్డారు. అందుకే ఇప్పుడు తన స్థానంలో మరొకరిని నియమించాలని భావిస్తున్నారట. బీహార్, ఢిల్లీ ఎన్నికల వరకు ఎదురు చూసి పరిస్థితి అనుకూలంగా లేకపోతే పార్టీ అధ్యక్ష బాధ్యతలను జెపి నడ్డా లేదా మరో యువనేతకు ఇవ్వాలని యోచిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news