వ్యాక్సిన్ పరిశోధన కోసం కేంద్రం 120 మిలియన్ డాలర్ల గ్రాంట్…!

కరోనా వైరస్ వ్యాక్సిన్ పరిశోధన కోసం ప్రభుత్వం 120 మిలియన్ డాలర్ల గ్రాంట్ ప్రకటించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ శుక్రవారం 8 వ బ్రిక్స్ ఎస్టీఐ మంత్రివర్గ సమావేశంలో అన్నారు. కరోనా వైరస్ కారణంగా హర్ష్ వర్ధన్ ఈ సంవత్సరం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ పరిశోధన కోసం మా ప్రభుత్వం 120 మిలియన్ డాలర్ల గ్రాంట్ ప్రకటించింది అని ఆయన చెప్పారు.

వ్యాక్సిన్ యొక్క వాస్తవ వ్యయాన్ని మరియు దాని పంపిణీ ఖర్చులను ఈ గ్రాంట్ కవర్ చేయదు అని పేర్కొన్నారు. మన దేశంలో వ్యాక్సిన్ పై ఇప్పుడు చాలా ఆశలే పెట్టుకుంది కేంద్రం. అయితే ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది ఏంటీ అనేది చెప్పడం ఇప్పుడు కష్టంగానే ఉంది. ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు అయితే వచ్చే ఏడాది మొదట్లో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది.