సినిమా ప్రేమికులకు శుభవార్త : రేపటి నుంచి ఏపీ థియేటర్లలో 100 శాతం ఆక్సుపెన్సీ

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా థియేటర్ల లో ఆక్యుపెన్సీని వంద శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది జగన్‌ ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని రేపటి నుంచి అంటే అక్టోబర్‌ 14 వ తేదీ నుంచే అమలు చేయనుంది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే.. కర్ఫ్యూ సమయంలో నూ కీలక నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్‌.

అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటలకు కర్ఫ్యూ సమయంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌. ఇక ఏపీస సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం తో… రేపటి నుంచి విడుదల కాబోయే సినిమా భారీ ఊరట లభించనుంది. రేపు మహా సముద్రం, ఎల్లుండి మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అలాగే.. పెళ్లి సందD సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.