రేపు ఎన్టీఆర్‌ రూ.100 నాణెం ఆవిష్కరణ

-

టీడీపీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) స్మారకార్థం ఈ నెల 28వ తేదీన ప్రత్యేకంగా రూ.100 నాణేన్ని ఆవిష్కరించేందుకు సిద్ధం అయ్యారు.. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ నాణేన్ని.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విడుదల చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి..

NTR 100 Rs Coin: రూ.100నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ.. అధికారిక గెజిట్ విడుదల | NTR 100 Rs Coin: Official Gazette Released For NTR 100 Rs Coin bvn

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో కేంద్రం ఈ ప్రత్యేక నాణేన్ని ముద్రించింది. ఈ నాణెం ఆవిష్కరణ కార్యక్రమంలో
పాల్గొనాలంటూ రాష్ట్రపతి భవన్ వర్గాలు చంద్రబాబుకు ఆహ్వానం పంపాయి. కాగా, ఈ ప్రత్యేక నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి
నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, పురందేశ్వరి తదితరులకు కూడా రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానాలు వెళ్లినట్టు తెలుస్తోంది.

అయితే, తాను ఎన్టీఆర్ భార్యనని, ఆయన చిత్రంతో ముద్రించిన నాణెం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే హక్కు తనకుందని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అంటున్నారు. ఈ మేరకు తనకు కూడా ఆహ్వానం పంపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లక్ష్మీపార్వతి లేఖ రాశారు. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news