నిన్న తెలంగాణ‌లో కొత్త‌గా 105 కరోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో శ‌ని వారం రోజు కొత్త‌గా 105 క‌రోనా కేసులు వ‌చ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా శ‌నివారం 23,888 మంది కి కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. అందులో 105 మందికి పాజిటివ్ అని తెలింది. దీంతో తెలంగాణ లో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 6,73,574 కు చేరింది. అలాగే శ‌ని వారం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కార‌ణంగా ఎలాంటి మ‌ర‌ణాలు సంభ‌వించ లేదు.

corona
corona

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రం లో క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డి చ‌నిపోయిన వారి సంఖ్య3,973 గా ఉంది. దీంతో పాటు శ‌ని వారం రోజు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 106 మంది కోవిడ్ బాధితులు క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కొలుకున్నారు. అలాగే మ‌న రాష్ట్రంలో ప్ర‌స్తుతం 3,740 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విష‌యాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే క‌రోనా ముప్పు ఇంకా తొలిగిపోలేద‌ని.. త‌గిన జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌క తీసుకోవాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news