తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షల కోసం హాల్ టికెట్లను ఈనెల 24 నుంచి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణ అందుకోసం చేసిన ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం మొత్తంగా 26 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.