మే నెల లో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు…!

-

బ్యాంకుల్లో మనకి చాలా పనులు ఉంటాయి. బ్యాంకు పనులు సరైన సమయానికి పూర్తి చేసుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి సెలవు రోజులు ముందే తెలుసుకొని మనకి ఉన్న బ్యాంకు పనులు పూర్తి చేసుకోవడం మంచిది. లేకపోతే డెడ్ లైన్ అయిపోయి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆదివారాలు, రెండో శనివారం, నాల్గవ శనివారం ఎలాగో బ్యాంకులకు సెలవే. ఇవి కాకుండా కొన్ని పండుగలు లేకపోతే పబ్లిక్ హాలిడేస్ వంటివి కూడా మే నెల లో వస్తూ ఉంటాయి వాటిని ముందే మనం తెలుసుకుని దానికి తగ్గట్టుగా మన బ్యాంకు పనులు పూర్తి చేసుకోవడం ముఖ్యం.

రిజర్వ్ బ్యాంక్ మే నెల కి సంబంధించి బ్యాంకు సెలవులని విడుదల చేసింది. ఇక ఏప్రిల్ నెల ఎలాగో పూర్తి కాబోతోంది మే నెల వచ్చేస్తోంది కాబట్టి మే నెలలో ఏ ఏ రోజులు బ్యాంకు లో సెలవు అనేది తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు మరి ఏ రాష్ట్రాలలో ఏ రోజులు సెలవులు వచ్చాయి అనేది ఇప్పుడే తెలుసుకుందాం.

మే 1, 2023: మహారాష్ట్ర డే/మే డే కారణంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా మరియు త్రివేండ్రం లో సెలవులు.

మే 5, 2023: బుద్ధ పూర్ణిమ కారణంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్ లో బ్యాంకులు క్లోజ్.

మే 7, 2023: ఆదివారం

మే 9, 2023: రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్‌కతాలో బ్యాంకులు క్లోజ్.

మే 13, 2023: రెండో శనివారం

మే 14, 2023: ఆదివారం

మే 16, 2023: రాష్ట్ర అవతరణ దినోత్సవం కారణంగా సిక్కింలో బ్యాంకులు పని చేయవు.

మే 21, 2023: ఆదివారం

మే 22, 2023: మహారాణా ప్రతాప్ జయంతి కారణంగా సిమ్లాలో బ్యాంకులు క్లోజ్.

మే 24, 2023: కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి కోసం త్రిపురలోని బ్యాంకులు క్లోజ్.

మే 27, 2023: నాల్గవ శనివారం

మే 28, 2023: ఆదివారం

Read more RELATED
Recommended to you

Latest news