తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు మంత్రి హరీష్ రావు. వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తామని ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, అకాల వర్షాలతో నోటికి వచ్చిన బుక్క జారిపోయిందని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఎంత సహాయం చేసిన రైతుకు తక్కువే..రైతులు అధైర్య పడొద్దని కోరారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేల రూపాయల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం ఇస్తామన్నారు. సిద్దిపేట జిల్లాలో 35 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వివరించారు. భవిష్యత్తులో ఓ నెల ముందే వరి నాట్లు వేసుకుంటే ఈ విపత్తు నుంచి తప్పించుకోవచ్చన్నారు మంత్రి హరీష్ రావు.