పీరియడ్స్ సమయంలో మహిళల కష్టాలను ఎవరూ కూడా అర్ధం చేసుకోవడం లేదు అనే ఆరోపణలు ఉంటాయి. అందుకే గుజరాత్ లోని సూరత్ నగరానికి చెందిన ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. 12 రోజుల పాటు తన కంపెనీలో పని చేసే మహిళా ఉద్యోగులకు అదనంగా పీరియడ్స్ సెలవలను ఇస్తున్నామని ప్రకటన చేసింది. 2014 లో స్థాపించిన భూతిక్ కేష్ అనే వ్యక్తి ఒక కంపెనీని స్టార్ట్ చేసాడు.
మొత్తం కంపెనీలో 8 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. అందుకే వారు ఎక్కడా కూడా ఇబ్బంది పడవద్దు అని భావించి వారికి సెలవలను ప్రకటించారు. భారత సమాజంలో ఋతుస్రావం విషయంలో ఇప్పటికి కూడా నిషేధం ఉంది అని, వారిని అవమానకరంగా చూస్తూ ఉంటారు అని, అందుకే తమ కంపెనీ ఆ ఇబ్బందులు ఉండవద్దు అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.